ఖైర్లాంజి కేసులో 6గురికి ఉరిశిక్ష
నాగపూర్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఖైర్లాంజి కేసులో ఆరుగురు దోషులకు స్థానిక భండారా సెషన్స్ కోర్టు ఉరిశిక్ష విధించింది. మరో ఇద్దరికి యావజ్జీవశిక్ష విధించింది. ఈ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు అభివర్ణించింది. ఈ కేసులో మొత్తం 8 మందికి ఉరిశిక్ష విధించాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదించారు. 2006 సెప్టెంబరు 29న నాగపూర్ సమీపంలోని ఖైర్లాంజి గ్రామంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది.
ఇది ముదిరి ఓ దళిత కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులను మరో వర్గంవారు చంపి కాలువలో పడేశారు. ఈ కేసును మొదట గ్రామంలో ఘర్షణగా చూసినా అనంతరం ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాల నిరోధక చట్టం కిందకు చేర్చారు. ఈ కేసును విచారించిన సీబీఐ 46 మందిని నిందితులుగా పేర్కొంది. చివరకు 11మందిపై ఛార్జిషీట్ దాఖలు చేసింది.












Click it and Unblock the Notifications