చంద్రబాబుతో నందమూరి హీరోల భేటీ
హైదరాబాద్ : తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడితో నందమూరి సినీ హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్, తారకరత్నలు సమావేశమయ్యారు. రాష్ట్రంలోని రాజీకీయపరిస్థితిపై వారు చర్చించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం భవిష్యత్ కార్యాచరణపై కూడా వారు చర్చించారని సమాచారం. ఇప్పటి వరకు జరిగిన నందమూరి హీరోల విందు సమావేశాల్లో తారకరత్న పాల్గొనలేదు. చంద్రబాబు ఆదివారంనాటి సమావేశానికి తారకరత్నను ఇంత వరకు ఆహ్వానించలేదని తెలుస్తోంది.
తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదని భావించిన తారకరత్న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొన్నారు. తెలుగుదేశం పా్రటీ అధినేత చంద్రబాబు పేరు ప్రస్తావించకుండా ఆయన ఈ సభల్లో రాజకీయ ప్రసంగాలు చేశారు. ఈ సభలకు పెద్ద యెత్తున అభిమానులు హాజరయ్యారు. బాలకృష్ణ, కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ లతో కలిసి రాజకీయాల్లో స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాల కోసం పనిచేస్తామని ఆయన ఆ సభల్లో చెప్పారు. దీంతో జరగబోయే నష్టాన్ని నివారించడానికి చంద్రబాబు ఆదివారంనాటి సమావేశానికి ఆహ్వానించినట్లు తెలుస్తోంది. వీరి మధ్య బాలకృష్ణ సయోద్య కుదురుస్తారని తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
