తారక్ కు బాబు, బాలయ్య బుజ్జగింపులు
హైదరాబాద్: కొంత కాలంగా అలకబూని పార్టీ కార్యకార్యకలాపాలకు దూరంగా ఉండడానికి సిద్ధపడిన సినీ హీరో తారకరత్నను తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, సినీ హీరో బాలకృష్ణ బుజ్జగించారు. దీంతో ఆయన చల్లబడినట్లు సమాచారం. ఫ్లాప్ హీరోగా పరిగణించి తారకరత్నను చంద్రబాబు దూరంగా పెట్టినట్లు వార్తలు వచ్చాయి. గతంలో బాలకృష్ణను, జూనియర్ ఎన్టీఆర్ ను, కళ్యాణ్ రామ్ ను ఆహ్వానించి చంద్రబాబు విందులు ఇచ్చారు. దీంతో తారకరత్న కర్నూలు, గుంటూరు జిల్లాల్లో బహిరంగ సభల్లో పాల్గొని తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు. దీంతో తారకరత్నను బుజ్జగించాల్సిన అవసరాన్ని చంద్రబాబు గుర్తించినట్లు సమాచారం.
ఆదివారంనాడు నందమూరి హీరోలు బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారకరత్నలకు చంద్రబాబు విందు ఇచ్చారు. ఈ సందర్భంగా వారి మధ్య తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించే విషయంపై చర్చ జరిగింది. దాదాపు రెండు గంటల పాటు వారి మధ్య చర్చలు జరిగాయి. ఇదే సమయంలో తారకరత్నను బుజ్జగించారు. తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం కల్పించాల్సిన బాధ్యత ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లదేనని, పార్టీలో యువతకు ప్రాధాన్యం ఉంటుందని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. యువగర్జన సదస్సులో పాల్గొనాలని ఆయన తారకరత్నను కోరినట్లు చెబుతున్నారు. ఇదే సమయంలో బాలకృష్ణను చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications
