చేనేత కార్మికులకు చిరు భరోసా
హైదరాబాద్: గుండె నిబ్బరంతో జీవించాలని, సమస్యలకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ప్రజారాజ్యం అధినేత చిరంజీవి అన్నారు. చేనేత కార్మికుల్లో త్వరలో వెలుగురేఖలు వస్తాయని, ఆ వెలుగును తాను తెస్తానని ఆయన భరోసా ఇచ్చారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదని, ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు చేనేత కార్మికులకు ఉందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. తనపై విమర్శలు చేయడం, తనకు సవాళ్లు విసరడ కాదు, సిరిసిల్ల బాధితులను ఆదుకోండని ఆయన రాష్ట్ర మంత్రి సబితా ఇంద్రారెడ్డికి సూచించారు.
రాష్ట్ర మంత్రికి ప్రత్యేక ఆర్థిక మండళ్లకు (సెజ్ లకు), గ్రోత్ సెంటర్లకు తేడా తెలియదని ఆయన విమర్శఇంచారు. సెజ్ లు ఎలా ఉండాలో గుజరాత్ వెళ్లి నేర్చుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. తనపై విమర్శలు చేయడం మానుకుని ప్రజల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. చేనేత కార్మికుల జీవితాల్లో వెలుగురేఖలు తెచ్చే బాధ్యత తనదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
