మూడో కూటమి ఏర్పాటు: నారాయణ
హైదరాబాద్: రాష్ట్రంలో మూడో కూటమి ఏర్పాటు ప్రయత్నాలను కొనసాగిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ చెప్పారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు వ్యతిరేకంగా ప్రజారాజ్యం అధినేత చిరంజీవితో కలిసి తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటుకు ఆయన కృషి చేస్తున్న విషయం తెలిసిందే. తాము తృతీయ ప్రత్యామ్నాయం ఏర్పాటు ప్రయత్నాలను మానుకోలేదని ఆయన చెప్పారు.
ఆయన ఆదివారం నాడు ఒక ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. తాము ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధినేత కె. చంద్రశేఖరరావుతో ఒక అవగాహనకు వచ్చినట్లు ఆయన తెలిపారు. చిరంజీవితో భేటీలో తాను పొత్తులపై చర్చించలేదని ఆయన చెప్పారు. తమ ప్రతిపాదనలను కేంద్ర నాయకత్వం పరిశీలించి నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. ఈ ఇఫ్తార్ విందులో సిపిఐ నాయకులు సురవరం సుధాకర్ రెడ్డి, చాడ వెంకటరెడ్డి, అజీజ్ పాషా కూడా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications
