వైయస్ నీరో చక్రవర్తి: దత్తాత్రేయ
నిజామాబాద్: ప్రభుత్వ అసమర్థత వల్లే చేనేత కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారనీ, ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి నీరో చక్రవర్తిలా ప్రవర్తిస్తున్నారని భారతీయ జనతా పార్టీ (బిజెపి) రాష్ట్ర అధ్యక్షుడు బండారు దత్తాత్రేయ అన్నారు. సంకల్ప యాత్రలో భాగంగా దత్తాత్రేయ, బిజెపి కార్యకర్తలు నిజామాబాద్ జిల్లాలోని తండాల్లో పర్యటిస్తున్నారు. కార్మికుల ఆత్మహత్యల నిరోధానికి చర్యలు తీసుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ముఖ్యమంత్రి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. వారంరోజుల్లో ఐదుగురు చేనేత కార్మికులు ఆత్యహత్య చేసుకున్నారని, అయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆయన అన్నారు. ఆరోగ్యశ్రీని అమలు చేస్తున్నామని చెబుతున్న ముఖ్యమంత్రి చేనేత కార్మికుల ఆకలి చావులను నివారించడానికి ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పడం లేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
