ఢిల్లీ పేలుడు: ముగ్గురికి చేరిన మృతులు
న్యూఢిల్లీ : ఢిల్లీ పేలుడులో గాయపడిన మరో వ్యక్తి మృతిచెందడంతో ఈ సంఘటనలో మృతుల సంఖ్య మూడుకు చేరుకుంది. ఈ పేలుడులో ఇప్పటికే ఒక బాలుడు, మరో గుర్తు తెలియని అరవై ఏళ్ల వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు చికిత్స పొందుతున్న మరో వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడని వైద్యులు తెలిపారు. పేలుడులో దాదాపు 22 మంది గాయపడ్డారు.
ఢిల్లీలోని మెహరౌలీలో శనివారం జరిగిన బాంబు పేలుడులో సంతోష్ అనే బాలుడు మృతి చెందాడు. రద్దీగా ఉండే మెహరౌలీలో ఈ పేలుడు సంభవించినప్పటికీ తీవ్రత తక్కువగా ఉండడంతో పెద్దగా ప్రాణనష్టం జరగలేదు. తీవ్రవాదులు టిఫిన్ బాక్సులో బాంబు పెట్టారు. అది పేలి ఈ ప్రమాదం సంభవించింది. ఈ పేలుడుకు సంబంధించి పోలీసులు ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.












Click it and Unblock the Notifications
