నర్సింగ్ విద్యార్థినిపై సామూహిక అత్యాచారం
విజయవాడ: విజయవాడ నర్సింగ్ హాస్టళ్లో విద్యార్థిని నాగారాణిపై సామూహిక అత్యాచారం జరిపిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాలుగు రోజుల క్రితం నాగారాణిని తల్లిదండ్రులు ఇంటికి తీసికెళ్లారు. అయినా ఆమె పరిస్థితి మెరుగుపడకపోవడంతో తిరిగి విజయవాడకు తెచ్చి ఆస్పత్రిలో చేర్పించారు. లైంగిక వేధింపుల వల్ల నాగారాణి మానసిక స్థిమితం కోల్పోయినట్లు భావిస్తున్నారు. అయితే తమ కూతురుపై సామూహిక అత్యాచారం జరిగిందని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
నాగారాణికి మత్తు పదార్థాలు ఇచ్చినట్లు, ఇంజక్షన్ కూడా చేసినట్లు ఆరోపణలున్నాయి. మతిస్థిమితం తప్పిందని నాగారాణిని హాస్టల్ నుంచి ఇంటికి పంపించివేశారు. అయితే ఆ అమ్మాయి ఇప్పటికీ కూడా కోల్కోలేదు. అపస్మారక స్థితిలోనే ఉంది. నాగారాణి నుంచి పోలీసులు రాతపూర్వకమైన వాంగ్మూలం తీసుకున్నారు. ఆమె సరిగా మాట్లాడలేకపోతోంది కూడా. తీవ్రమైన భయానికి గురైన సూచనలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications
