చిరు అవగాహనతోనే మాట్లాడారు: కోటగిరి
విశాఖపట్నం : కాంగ్రెస్ మంత్రులకు పారిశ్రామికవాడలకు , ప్రత్యేక ఆర్థికమండళ్ల (సెజ్)కు తేడా తెలియదని ప్రజారాజ్యం పార్టీ నాయకుడు కోటగిరి విద్యాధరరావు ఎద్దేవా చేశారు. తెలుగుదేశం హయాంలో పోలేపల్లి ప్రాంతంలో సెల్ఫ్‌గ్రోత్ కారిడార్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేశామని, అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ స్థలాన్నే ప్రత్యేక ఆర్థికమండలిగా మార్చివేసిందని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వెల్లడించారు.
తమ పార్టీ అధినేత చిరంజీవి ప్రత్యేక ఆర్థికమండళ్లపై పూర్తి అవగాహనతోనే మాట్లాడుతున్నారని ఆయన తెలిపారు. సెజ్ లపై అవగాహన లేకుండా చిరంజీవి మాట్లాడుతున్నారనే రాష్ట్ర మంత్రుల విమర్శలను ఆయన ఖండించారు. మంత్రులకే నిజానికి సెజ్ లకు, గ్రోత్ సెంటర్లకు మధ్య తేడా తెలియదని ఆయన అన్నారు. అనుత్పాదక రంగాలకు సెజ్ ల పేరిట రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇస్తోందని ఆయన విమర్శించారు.












Click it and Unblock the Notifications
