భవానీపై నన్నపనేని రుసరుసలు
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకురాలు గంగా భవానీపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నపనేని రాజకుమారి రుసరుసలాడారు. తనపై గంగా భవానీ చేసిన వ్యాఖ్యలపై ఆమె ఆదివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో విరుచుకుపడ్డారు. తనకు తెలుగుదేశం పార్టీలో తగిన గౌరవం ఉందని, తెలుగుదేశంలో తనకు గుర్తింపు లేదని గంగా భవానీ చేసిన విమర్శలో నిజం లేదని ఆమె అన్నారు. తాను తెలుగుదేశం పార్టీలో అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నానని ఆమె చెప్పారు.
తనను దిష్టిబొమ్మ అన్నందుకు తాను బాధపడడం లేదని, గంగాభవానీ పిచ్చితనానికి, పొగరుకు బాధపడుతున్నానని ఆమె అన్నారు. తమ పార్టీ నేత మాటకు కట్టుబడి తాను పార్టీలో కొనసాగుతున్నానని ఆమె చెప్పారు. తనకు ప్రజల్లో తగిన గౌరవం ఉందని ఆమె అన్నారు. గంగా భవానీని ఆడవాళ్లు, మగవాళ్లు అసహ్యించుకుంటున్నారని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications
