కార్పోరేట్ ఆస్పత్రులకు వైయస్ తాయిలాలు
హైదరాబాద్: కార్పోరేట్ ఆస్పత్రులకు ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి తాయిలాలు ప్రకటించారు. ప్రజలకు మరిన్ని సేవలు విస్తరిస్తే కార్పోరేట్ ఆస్పత్రులకు ఉచితంగా భూములు ఇస్తామని, లేదంటే తక్కువ ధరకు ఇస్తామని ఆయన హామీ ఇచ్చారు. స్టార్ అనే కార్పోరేట్ ఆస్పత్రిని ఆయన ప్రారంభించారు. హైదరాబాదులో కష్టం గానీ జిల్లాల్లో భూములు పుష్కలంగా ఉన్నాయని, కార్పోరేట్ ఆస్పత్రులు తమ సేవలను జిల్లాలకు విస్తరిస్తే ఉచితంగా లేదా తక్కువ ధరకు భూములు ఇస్తామని ఆయన చెప్పారు. ఆరోగ్యశ్రీ వల్ల పేదలకు ఎంతో ప్రయోజనం చేకూరుతోందని ఆయన చెప్పారు.
ప్రజలు పాలు పంచుకున్నప్పుడే ప్రభుత్వ పథకాలు సఫలమవుతాయని భారతీయ జనతా పార్టీ (బిజెపి) సీనియర్ నేత ఎం. వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సభలో ఆయన ఛలోక్తులు విసురుతూ చేసిన ప్రసంగం ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. రాజకీయనాయకులు మూడు సూత్రాల పథకంతో పనిచేస్తారని, అవి ఎలక్షన్స్, కలెక్షన్స్, సెలెక్షన్స్ అని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
