ఢిల్లీకి వైయస్: 3 రోజులు అక్కడే

హైదరాబాద్: మూడు పర్యటన నిమిత్తం ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ఆదివారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. మూడు రోజుల పాటు ఆయన ఢిల్లీలోనే ఉంటారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో ఆయన సమావేశమవుతారు. లోకసభకు ముందస్తు ఎన్నికలు జరగవచ్చునని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనకు ప్రాధాన్యం చేకూరింది.

రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై, ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రభావంపై ఆయన సోనియా గాంధీతో చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ఆయన సోనియాకు వివరిస్తారు. అంతేకాకుండా ఎరువుల కొరతపై, చేనేత కార్మికుల ఆత్మహత్యలపై ఆయన సోనియాకు వివరణ ఇస్తారు. ఆయన కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ కు కలిసే అవకాశం ఉంది. రామగుండంలో ఎరుపుల ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఆయన పాశ్వాన్ తో మాట్లాడుతారు. కాగా, పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రేపు (సోమవారం) ఢిల్లీ వెళ్తారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+