చిరంజీవికి మహిళల నీరాజనం

శ్రీకాకుళంలో నిర్వహించిన రోడ్ షోలో మత్స్యకారులు తమ సమస్యలను చిరంజీవికి విన్నవించుకున్నారు. చిరంజీవి మాట్లాడుతూ మీ పిలుపు మేరకు నేను వచ్చాను, మీరు మార్పు కోరుకుంటున్నారు, అది ప్రజారాజ్యంతో తోనే సాధ్యమని అన్నారు. మీ నమ్మకాన్ని వమ్ము చేయను మీ కోర్కె తీర్చడమే ప్రజారాజ్యం ఎజెండా అని చిరంజీవి పేర్కొన్నారు.
ఉత్తరాంధ్రలో వెనుకబాటు తనానికి వలసలే నిదర్శనమని, ఇక్కడ మత్స్య సంపద ఉంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాలి, పొందూరు చేనేతకు పెట్టింది పేరు అలాంటిది వారికి ఆదరణ కరువైంది. రాష్ట్రంలో నిత్యావసరాలు పెరిగిపోయాయి, ధరలు చుక్కలనంటాయి, పేద, మధ్య తరగతి కుటుంబాల వారు ఎలా బ్రతుకుతారు, వీటన్నిటికి కారణం ఎవరు? అంటూ చిరంజీవి ప్రశ్నించారు. అందుకే మీ పిలుపు మేరకు నేను వచ్చాను. మీ కష్ట, నష్టాలు తెలుసుకుని వాటి పరిష్కార దిశగా పయనిస్తానని చిరంజీవి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications