చిరంజీవిని కలిసిన నక్సలైట్ చంద్రక్క
శ్రీకాకుళం: ప్రముఖ నక్సలైట్ నాయకుడు పైలా వాసుదేవరావు భార్య చంద్రక్క శనివారం ఉదయం పలాసలో ప్రజారాజ్యం అధినేత చిరంజీవిని కలుసుకున్నారు. చిరంజీవి "అభిలాష" సినిమాను చూసి ఆయనను అభినందించడానికి ఆనాడు తాము ఆయనను కలుసుకున్నామని, తాము చేస్తున్న ప్రజా ఉద్యమానికి ఆయన ఆర్ధిక సహకారం చేస్తానని ముందుకు వచ్చినా తాము తీసుకోలేదని చంద్రక్క చెప్పారు.
చిరంజీవిని తాను కలుసుకోవడం తాను ఆ పార్టీలో చేరుతున్నానడానికి ఉదాహరణ కాదని, ప్రజా సమస్యలను చిరంజీవికి విన్నవించడానికే ఆయనను కలుసుకుని చర్చించానని చంద్రక్క తెలిపారు. నక్సలైట్ల సమస్యను కేవలం శాంతి భద్రతల సమస్యగా పరిగణించడం లేదని, అది సామాజిక, ఆర్ధిక సమస్యల నుంచి కూడా ఉద్భవించిందని ప్రజారాజ్యం అధికార ప్రతినిధి డాక్టర్ మిత్రా అన్నారు. ఆయన శనివారం ఉదయం పలాసలో విలేకరుల సమావేశంలో ప్రసంగిస్తూ ఈ విషయం చెప్పారు.












Click it and Unblock the Notifications