శ్రీకాకుళం: ప్రజల కోసమే ప్రజారాజ్యం పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ అధికార ప్రతినిధి డా.మిత్రా అన్నారు. ప్రత్యామ్నాయం చూపకుండా పరిశ్రమల కోసం భూములను స్వాధీనం చేసుకునే విధానాన్ని తాము అంగీకరించమని ఆయన స్పష్టం చేశారు. పరిశ్రమలకు ప్రజారాజ్యం పార్టీ స్వాగతం పలుకుతుందని అయితే పరిశ్రమలకు ఎంత అవసరమో అంతే భూమిని కేటాయిస్తామని తెలిపారు. ఒకరి జీవనధారమైన భూములను లాక్కొని ఇతరులకు స్వాధీనం చేసే ప్రక్రియకు ప్రజారాజ్యం పార్టీ పూర్తి వ్యతిరేకమని ఆయన పేర్కొన్నారు. నక్సలిజాన్ని సాంఘిక,ఆర్థికసమస్యగానే పరిగణిస్తామని ఆయన వెల్లడించారు.