ఉద్వాసనపై వెనక్కి తగ్గిన జెట్

Jet Airlines
ముంబయి: తమ సంస్థ నుంచి తొలగించిన 1900 మంది ఉద్యోగులను 48 గంటలు తిరగకుండానే జెట్ ఎయిర్ వేస్ మళ్లీ తీసుకుంది. శుక్రవారం నుంచి విధుల్లోకి రావాలని ఉద్వాసనకు గురైన ఉద్యోగులను ఆయన విజ్ఞప్తి చేశారు. గురువారం రాత్రి పొద్దు పోయిన తర్వాత మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేసి జెట్ ఎయిర్ వేస్ చైర్మన్ నరేష్ గోయల్ ఆ విషయాలు చెప్పారు. ఉద్వాసనకు గురై గత రెండు రోజులుగా మానసిక క్షోభకు గురైన ఉద్యోగులకు ఆయన క్షమాపణలు చెప్పారు. కంపెనీ కుటుంబం లాంటిదని, ఉద్యోగులు కుటుంబ సభ్యులని, కుటుంబం పెద్దగా విషాదకరమైన ముఖాలను తాను చూడలేనని, తన ఉద్యోగులు ఆందోళన చెందడం తాను భరించలేనని ఆయన అన్నారు.

రాజకీయ ఒత్తిడితో తాను ఈ నిర్ణయం తీసుకోలేదని, పరిశ్రమ సంక్షోభంలో కూరుకుపోవడంతో ఉద్యోగులను తొలగించాలని కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుందని, వారిని తిరిగి తీసుకోవాలనేది తన నిర్ణయమని ఆయన వివరించారు. ఇందులో ఎవరి ప్రమేయమూ లేదని, తన భార్య ప్రమేయం కూడా లేదని, ఉద్యోగులందరూ తన కుటుంబ సభ్యులని, తన నిర్ణయానికి కింగ్ ఫిషర్ తో తమ కలయికకు సంబంధం లేదని ఆయన చెప్పారు. గత రెండు రోజులుగా తనకు నిద్ర పట్టడం లోదని, ఆర్థిక విషయాలే ముఖ్యం కాదని, తన ఆత్మప్రబోధం మేరకు తాను వ్యవహరిస్తున్నానని ఆయన చెప్పారు. ఈ విషయంలో లోపలి నుంచి గానీ, వెలుపలి నుంచి గానీ ఏ విధమైన ఒత్తిడి లేదని ఆయన చెప్పారు.

పౌర విమాన యానాల మంత్రి ప్రఫుల్ పటేల్ తో మాట్లాడిన తర్వాత ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని నరేష్ గోయల్ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ప్రభుత్వం జెట్, కింగ్ ఫిషర్ వంటి ప్రైవేట్ పౌర విమాన యాన సంస్థలను సంక్షోభం నుంచి బయట పడేయడానికి 4,700 కోట్ల రూపాయల బెయిల్ ప్యాకేజీకి ప్రభుత్వం అంగీకరించినట్లు సమాచారం. ఈ ప్యాకేజీకి, ఉద్యోగులను తిరిగి తీసుకోవడానికి ప్రఫుల్ పటేల్ ముడి పెట్టినట్లు చెబుతున్నారు. దీంతో జెట్ ఎయిర్ వేస్ తిరిగి ఉద్యోగులను తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+