తిరుపతి: చేనేత కార్మికుల ఉత్పత్తులకు డిమాండ్ పెంచేందుకు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవిని ఇకపై చేనేత వ్రస్తాలు ధరించాల్సిందిగా సూచిస్తామని చేనేత కార్మికుల సమస్యలపై ఏర్పాటైన ప్రజారాజ్యం పార్టీ అధ్యయన కమిటీ బృందం తెలిపింది. తిరుపతిలో వీరు విలేఖరుల సమావేశం నిర్వహించారు. చేనేత ఉత్పత్తుల మార్కెటింగ్‌లో చెబుతున్న క్రమంలో.. చిరంజీవి చేనేత వ్రస్తాలు ధరిస్తే ఆయన అభిమానులూ వాటినే ధరిస్తారని డిమాండు పెరుగుతుంది కదా? అని విలేఖరులు సూచించారు. దీనికి స్పందించిన అధ్యయన కమిటీ చైర్మన్ కె.ఎస్.ఆర్ మూర్తి ఈ విషయాన్ని చిరంజీవి దృష్టికి తీసుకువెళ్తానన్నారు