యోగా నా సౌందర్య రహస్యం: అనుష్క
విశాఖపట్నం: యోగానే తన సౌందర్య రహస్యమని ప్రముఖ హీరోయిన్ అనుష్క అంటోంది. యోగా తన జీవితంలో ఒక భాగమని ఆమె చెప్పింది. తన అందానికి సంబంధించిన రహస్యమేదీ లేదంటూనే ఆమె ఈ విషయం చెప్పింది. విశాఖపట్నంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మీడియా ప్రతినిధులతో మాట్లాడింది. విశాఖపట్నం తనకు ఎంతగానో నచ్చిందని ఆమె చెప్పింది.
విశాఖపట్నం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతోందని, సుందర నగరంగా ఇది రూపు దిద్దుకుంటుందని ఆమె అన్నది. హైదరాబాదు లాగా, ఇంకా చెప్పాలంటే హైదరాబాదు కన్నా బాగా విశాఖపట్నం అభివృద్ధి చెందుతుందని ఆమె ఆశాభావం వ్యక్తం చేస్తోంది.












Click it and Unblock the Notifications
