తెలంగాణ కోసం దేవేందర్ ఢిల్లీ యాత్ర
హైదరాబాద్ : పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ నవతెలంగాణ ప్రజాపార్టీ అధ్యక్షుడు దేవేందర్ గౌడ్ ఆదివారం న్యూఢిల్లీకి పయనమయ్యారు. గౌడ్ తో పాటు వివిధ రాజకీయపక్షాలు, తెలంగాణ సంఘాల ప్రతినిధులు ఢిల్లీకి బయలుదేరారు. ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, ప్రతిపక్ష నాయకుడు అద్వానిలను కలుస్తామని పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టాలని కోరతామని ఆయన అన్నారు. తెలంగాణపై ఎవరి వైఖరి ఎంటో త్వరలోనే ప్రజల ముందు పెడతామని గౌడ్ తెలిపారు.
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకునేందుకు అన్ని రాజకీయ పార్టీలను, నాయకులను కలుసుకుంటామని, ఈ ప్రక్రియను మరింత వేగవంతం చేస్తామని గౌడ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ ఢిల్లీ పర్యటనలో కృషి చేస్తామని ఆయన చెప్పారు. తమ ఈ ప్రయత్నం ద్వారా ఎవరెటు ఉన్నారో తేలిపోతుందని ఆయన అన్నారు. ఢిల్లీకి రావాలని తాము అన్ని పార్టీల నాయకులను కోరినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
