గాలితో మాట్లాడే యత్నం చేస్తున్నా: డిఎస్
హైదరాబాద్: తన నియోజకవర్గాన్ని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపిస్తూ ధర్నాకు దిగిన తమ పార్టీ శాసనసభ్యుడు గాలి ముద్దు కృష్ణమనాయుడుతో మాట్లాడడానికి ప్రయత్నిస్తున్నట్లు ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ చెప్పారు. తన నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటున్నారని ముద్దు కృష్ణమనాయుడు తనకు ఎప్పుడూ ఫిర్యాదు చేయలేదని ఆయన అన్నారు. రాజీవ్ గాంధీ సద్భావనా యాత్ర అవార్డు ప్రదానోత్సవం సందర్భంగా ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.
పుత్తూరు నియోజక వర్గ అభివృద్ధిని ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపిస్తూ అధికార కాంగ్రెస్ ఎమ్మెల్వే గాలి ముద్దు కృష్ణమనాయుడు శనివారం ఉదయం పున్నమి హోటల్ సమీపంలోని జాతీయ రహదారిపై ధర్నాకి దిగారు. ప్రభుత్వం వెంటనే ప్పందించి ఇక్కడి సమస్యలు పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ముద్దు కృష్ణమనాయుడు అనుచరులు, మున్సిపల్ ఛైర్మన్ అంకయ్య తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డిపై కూడా గాలి ముద్దుకృష్ణమ నాయుడు విమర్శలు చేశారు.












Click it and Unblock the Notifications
