సెజ్ లపై ప్రతిపక్షాల ప్రత్యక్ష పోరు
హైదరాబాద్: ప్రత్యేక ఆర్థిక మందళ్లకు భూమి కేటాయంపుపై ప్రత్యక్ష పోరుకు దిగాలని ప్రతిపక్షాలు నిర్ణయించుకున్నాయి. కోస్తా కారిడార్ కు, సెజ్ లకు వ్యతిరేకంగా సిపిఐ ఆదివారం జరిగిన రౌండ్ టేబుల్ సమావేశానికి ప్రతిపక్షాల నాయకులు హాజరయ్యారు. బి.వి. రాఘవులు (సిపిఎం), లాల్ జాన్ బాషా (టిడిపి), కె. చంద్రశేఖరరావు (తెరాస), మిత్రా (ప్రజారాజ్యం) తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కోస్తా కారిడార్ కు, కాకినాడ సెజ్ కు అఖిలపక్ష బృందం వెళ్లాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె. నారాయణ ప్రతిపాదించారు. సెజ్ ల పేరుతో ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తోందని వారు విమర్శించారు.
కోస్తా కారిడార్‌తోపాటు రాష్ట్రంలో సెజ్‌లకు కేటాయించిన భూములపై పునఃసమీక్ష జరిపి భూములను వెనక్కు తీసుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. రైతులు ఉత్సాహంగా భూములు ఇచ్చేందుకు వీలుగా నష్టపరిహారం ఉండాలని ఆయన అన్నారు. సెజ్‌లకు భూసేకరణలో ప్రభుత్వ ప్రమేయం అవసరం లేదనీ, కంపెనీలే ఆ బాధ్యతను తీసుకుంటాయని అన్ని రాజకీయపక్షాల నాయకులు అన్నారు. భూకేటాయింపులను రద్దు చేయాలని కోరారు. సెజ్ ల పేరుతో పెద్ద గద్దలకు ప్రభుత్వం భూములను కట్టబెడుతోందని, వీటి వల్ల ప్రభుత్వంలోని పెద్దలు లాభపడుతున్నారని కెసిఆర్ విమర్శించారు. డబ్బుల సంపాదన కోసమే భూకేటాయింపులు జరుగుతున్నాయని, ఇది దేశంలోనే అతి పెద్ద కుంభకోణమని ఆయన అన్నారు. తాము అధికారంలోకి వస్తే రైతులకు జరిగిన నష్టాన్ని పూడుస్తామని ప్రజారాజ్యం నాయకుడు మిత్రా చెప్పారు. అక్రమంగా తీసుకున్న భూములను తిరిగి ఇచ్చేందుకు జీవోలు ఇస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
