తెలంగాణపై డిఎస్ తో పెద్దిరెడ్డి భేటీ
హైదరాబాద్ : 2004 ఎన్నికల ముందు తెలంగాణపై ఇచ్చిన వాగ్దానాన్ని కాంగ్రెస్ నిలబెట్టుకోవాలని నవ తెలంగాణ ప్రజాపార్టీ నేత పెద్దిరెడ్డి కోరారు. ఢిల్లీ వెళ్లే నవ తెలంగాణ ప్రజాపార్టీ బృందంతో కలిసిరావాలని పీసీసీ అధినేత డి.శ్రీనివాస్‌ను ఆయన కోరారు. ఈ మేరకు డీఎస్‌కు ఆయన ఆదివారం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం గాంధీభవన్ లో వినతిపత్రాన్ని సమర్పించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు పార్లమెంటులో బిల్లును ప్రవేశ పెట్టేలా చూడాలని ఆయన శ్రీనివాస్ ను కోరారు.
ఈ పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టకపోతే కాంగ్రెస్ ప్రజల ముందు దోషిగా నిలబడుతుందని ఆయన అన్నారు. తెలంగాణ విషయంలో తమకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీపై నమ్మకం ఉందని ఆయన అన్నారు. తాము తెలంగాణకు అనుకూలంగా ఉన్నామని, తెలంగాణకు అనుకూలంగా సోనియా గాంధీ నిర్ణయం తీసుకుంటారని తెలంగాణ కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ విషయంలో తనదేమీ లేదని, సోనియా గాంధీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డి కూడా అంటున్నారని, అందువల్ల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కాంగ్రెస్ నాయకులు చొరవ చూపాలని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
