బాలయ్య, బాబు రెండు కళ్లు: తారకరత్న
నెల్లూరు: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మామయ్య నారా చంద్రబాబు నాయుడు, బాబాయ్, ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ తనకు రెండు కళ్లు అని సినీ హీరో తారకరత్న అన్నారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తమ ప్రధాన లక్ష్యమని ఆయన అన్నారు. నెల్లూరులోని ఒక కార్యక్రమంలో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు తెలుగుదేశం పార్టీ నాయకులు ఆయనకు స్వాగతం పలికి పూలమాలలు వేశారు. కాబోయే ముఖ్యమంత్రి బాలయ్య అంటూ అభిమానులు నినాదాలు చేశారు.
తమ అభిమానులంతా తమతోనే ఉన్నారని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీని తిరిగి అధికారంలోకి తేవడమే తమ లక్ష్యం గానీ ఇతరులను విమర్శించడం తమ అభిమతం కాదని ఆయన అన్నారు. తారకరత్న ఇటీవల దక్షిణ కోస్తా జిల్లాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. తమ కుటుంబమంతా కలిసే ఉందని ఆయన ఎప్పటికప్పుడు చెబుతూ వస్తున్నారు.












Click it and Unblock the Notifications
