మాకు ఎవరూ సాటి లేరు: వైయస్
హైదరాబాద్: అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తమకు ఎవరూ సాటి లేరని, ఇందులో తామే మేటి అని ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్, శంషాబాద్ మండలాల్లో ఆయన ఆదివారం పలు ప్రారంభోత్సవ, శంకుస్థాపన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో గుడిసెలు లేకుండా చేస్తామని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరికీ పక్కా ఇల్లు నిర్మించి ఇస్తామని, పేదలందరికీ ఇళ్లు ఇస్తామని ఆయన చెప్పారు. ఇందిరమ్మ గృహాల నిర్మాణం కూడా ప్రారంభమైందని ఆయన చెప్పారు.
వచ్చే నెల నుంచి వికలాంగులకు ఐదేసి వందల రూపాయల పింఛన్లు ఇస్తామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్లు, పెన్షన్లు ఇస్తామని ఆయన చెప్పారు. రైతుల రుణ మాఫీ పథకాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చేపడుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు.












Click it and Unblock the Notifications
