గుంటూరులో తమ్ముళ్ల బాహాబాహీ
గుంటూరు : తెలుగుదేశం పార్టీ నిర్వహించనున్న యువగర్జన ప్రాంగణంలో తెలుగుదేశంలోని రెండు వర్గాల మధ్య ఆదివారం ఘర్షణ జరిగింది. తెలుగుయువత అధ్యక్షుడు శ్రీనివాసరావు, కార్పోరేటర్ సుధాకర్ వర్గీయుల మధ్య గొడవ జరిగింది. రెండు వర్గాలు ఒకరిపై ఒకరు కర్రలతో దాడి చేసుకున్నారు. ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులపై కూడా వారు దాడి చేశారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో గొడవ సద్దుమణిగింది.
పోలీసుల రంగప్రవేశంతో కార్యకర్తలు పరారయ్యారు. వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. గొడవ పడుతున్న కార్యకర్తలను తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఆపేందుకు ప్రయత్నించారు. అయినా ఫలితం లేకపోయింది. తమపై దాడికి నిరసనగా జర్నలిస్టులు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. వేదిక ఏర్పాట్లను యనమల రామకృష్ణుడు ఆదివారం పరిశీలించారు. కనీవినీ ఎరుగని రీతిలో వచ్చేనెల 5వ తేదీన యువగర్జన సదస్సు జరుగుతుందని ఆయన చెప్పారు. ప్రాంగణానికి స్వర్గీయ ఎన్టీ రామారావు పేరు పెట్టినట్లు ఆయన తెలిపారు.












Click it and Unblock the Notifications
