చంద్రబాబే సిఎం అవుతారు: అశ్వినీదత్

ఇదిలా ఉండగా, గుంటూరులో జరుగనున్న టీడీపీ యువగర్జనకు రంగం సిద్ధమైంది. ఈ గర్జన ద్వారా ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నిస్తోంది. ఈ దశలో గుంటూరు జిల్లాలో బుధవారం నిర్వహించనున్న యువగర్జన సభతో రాష్ట్రంలో తమకు కొత్త శక్తి లభిస్తుందని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు విశ్వసిస్తున్నారు. ఒకవైపు ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజల్లోకి వెళుతూ విస్తృత పర్యటనలు చేపడుతుండగా, మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సదస్సుల పేరిట ప్రజలను పలకరిస్తోంది. ఇలాంటి సమయమే యువగర్జనకు సరైందని తెలుగుదేశం పార్టీ భావించి గర్జనకు వేదికను సిద్ధం చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications