అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని హత్య
హైదరాబాద్: అమెరికాలో మరో తెలుగు విద్యార్థిని హత్యకు గురైంది. ఈ హత్య మూడు రోజుల తర్వాత వెలుగు చూసింది. అర్పణ అనే విద్యార్థిని సియాటిల్ లో హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తులు ఆమె గొంతు కోసి హత్య చేసినట్లు ఇక్కడికి సమాచారం అందింది. అక్టోబర్ 31వ తేదీన అర్పణ హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆమె కుటుంబం హైదరాబాదులోని మెహిదీ పట్నంలో నివాసం ఉంటోంది. ఆమె తండ్రి జెనేగా జవహర్ లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (జెఎన్ టియు)లో రెక్టారుగా పని చేస్తున్నారు. సియాటల్ లో అర్పణ ఎంఎస్ చదువుతోంది. వివరాలు అందాల్సి ఉంది.












Click it and Unblock the Notifications