రక్తపుటేరులు నేతల పుణ్యమే: చిరు

Chiranjeevi
అనంతపురం: రత్నాల సీమ రాయలసీమలో నాయకులు రక్తపుటేరులు పారిస్తున్నారని, స్వప్రయోజనాల కోసమే రాజకీయ నాయకులు ఫాక్షన్ కక్షలను ప్రోత్సహిస్తున్నారని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి విమర్శించారు. చిరంజీవి ప్రజా అంకిత యాత్ర సోమవారం అనంతపురం జిల్లాలోని ధర్మవరం తదితర ప్రాంతాల్లో జరిగింది. తాము అధికారంలోకి వస్తే ఫాక్షనిజాన్ని పూర్తిగా రూపుమాపుతామని ఆయన చెప్పారు. ముఠా కక్షలను ప్రోత్సహిస్తున్నవారికి తమ పార్టీ మాత్రమే చెక్ పెడుతుందని ఆయన అన్నారు.

తాము అధికారంలోకి వస్తే చేనేత కార్మికుల కోసం సంక్షేమ బోర్డును ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తాను సిరిసిల్ల చేనేత కార్మికులను పరామర్శించిన తర్వాతనే ప్రభుత్వంలో చలనం వచ్చిందని ఆయన చెప్పారు. ధర్మవరంలో మహిళలు చిరింజీవికి పట్టుచీరను బహూకరించారు. ఈ చీరను తాను తన తల్లికి ఇస్తానని ఆయన చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+