శ్రీకాకుళం జిల్లాలో భూప్రకంపనలు
శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లా కంతిల, కవిటి మండలాల్లో సోమవారం స్వల్పంగా భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. 20 రోజుల క్రితం కూడా ఇక్కడ ఇదే తరహాలో భూమి కంపించింది. సముద్ర తీరం ఎక్కువగా ఉండడం వల్ల, భూగర్భ జలాలు అడుగంటి పోవడం వల్ల ఇక్కడ భూమి కంపిస్తోందని అధికారులు అంటున్నారు. ఇక్కడ భూమి కంపించడం ఒక ఆనవాయితీగా మారింది. దీంతో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. ప్రజలు మాత్రం తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. తాము గ్రామాలు వదిలిపెట్టి వెళ్లిపోవాల్సిన పరిస్థితి వస్తోందని వారంటున్నారు. భూమి కంపించిన ప్రాంతాలు శ్రీకాకుళానికి 80 కిలోమీటర్లు దూరంలో ఉంటాయి.












Click it and Unblock the Notifications