కాంగ్రెసులో ఎమ్మెల్యే దొరబాబు
హైదరాబాద్: భారతీయ జనతాపార్టీ (బిజెపి)కి చెందిన పీఠాపురం శాసనసభ్యుడు దొరబాబు కాంగ్రెస్ పార్టీలో చేరారు. గత కొంతకాలంగా ఆయన బిజెపి కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అద్వానీ విజయసంకల్ప యాత్రకు ముందే ఆయన కాంగ్రెస్ శాసనసభా పక్షం (సీఎల్పీ) కార్యాలయంలో దర్శనం ఇవ్వటంతో ఆయన కాంగ్రెస్‌లో చేరతారని ప్రచారం జరిగింది. తాను ఏ పార్టీలో చేరేదీ తరువాత చెబుతానని అన్నారు. ఆయన ఎట్టకేలకు ఈరోజు అధికారికంగా కాంగ్రెస్‌లో చేరారు.
ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి, ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ సమక్షంలో ఆయన బుధవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేసే అవకాశం ఉంది. ఆయన ప్రజారాజ్యం పార్టీలో చేరుతారని తొలుత ప్రచారం జరిగింది. అయితే, పిఠాపురం సీటును వంగా గీతకు ఇస్తామని ప్రజారాజ్యం నాయకత్వం హామీ ఇచ్చింది. దీంతో దొరబాబు కాంగ్రెస్ లో చేరి తిరిగి పిఠాపురం నుంచి పోటీ చేయడానికి సిద్ధపడుతున్నారు.












Click it and Unblock the Notifications