వైయస్ కోటలో చిరంజీవి మాట

తాను రాజకీయాల్లో కొత్త పాత్ర పోషిస్తున్నానని, ఈ పాత్రలో తాను జీవిస్తానని చిరంజీవి పులివెందులలో అన్నారు. పులివెందుల ప్రజలు తనకు అపూర్వ స్వాగతం పలికారని, ఈ అనుభూతి తనలో ఉండిపోతుందని ఆయన అన్నారు. ప్రజలకు తాను అండగా ఉంటానని, ప్రజలకు సేవ చేస్తానని ఆయన చెప్పారు. ఇంత మంది ప్రజలు తన వెనక ఉన్నారంటే ఎంతో గుండె ధైర్యం కలుగుతోందని, తనకు అది చాలునని ఆయన అన్నారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆయన విమర్శించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఆ సమస్యను పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. మహిళల సమస్యలపై కూడా ఆయన తన ప్రసంగంలో ప్రధానంగా ప్రస్తావించారు.












Click it and Unblock the Notifications