జోగయ్యపై చిరంజీవి ఆగ్రహం?

అయితే నేరుగా చిరంజీవి బెడ్‌రూంలో ఉండే ఫ్యాక్స్ నెంబర్‌కే పంపినట్టు జోగయ్య ప్రకటించడం గమనార్హం. లేఖ బయటకు ఎలా లీక్ అయిందన్న దానిపై పార్టీలో తర్జనభర్జనలు సాగుతున్నాయి. ప్రభుత్వం తమ ఫ్యాక్స్‌లను సైతం ట్యాప్ చేస్తోందంటూ పీఆర్పీ ఆరోపించింది. దాని పర్యవసానమే జోగయ్య లేఖ లీక్ అని పేర్కొంది. తమ ఫోన్లను ట్యాప్ చేస్తున్నారంటూ ఇటీవల పీఆర్‌పీ నేతలు ఆరోపించిన విషయం విదితమే.
నేరుగా జోగయ్య వర్గీయులే ఈ లేఖను ఒక పత్రికకు లీక్ చేసి ఉంటారని మరో కథనం వినిపిస్తుండగా, జోగయ్య కుమారుడే లీక్ చేసి ఉంటారనేది ఇంకో కథనం. జోగయ్య కుమారుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నందున ఆయన ద్వారానే ఈ లేఖ లీక్ అయి ఉంటుందన్న అనుమానాలు పీఆర్‌పీలో వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ పట్ల ప్రజారాజ్యం తీసుకున్న నిర్ణయం వల్ల కోస్తా ఆంధ్రలో కొంత నష్టం జరుగుతుందంటూ మరో సీనియర్ నేత తమ్మినేని సీతారాం చేసిన వ్యాఖ్యల పట్ల కూడా 'చిరు' శిబిరం చిటపటలాడుతోంది.












Click it and Unblock the Notifications