కెసిఆర్ ప్రకటనను ఖండించను: డిఎస్

పులివెందుల ఘటనపై మీడియా ప్రతినిధులు ప్రస్తావించగా దాడులు మంచి సంప్రదాయం కాదని ఆయన అన్నారు. తెలంగాణపై ఎన్నికల లోపు తమ పార్టీ అధిష్ఠానవర్గం ఏదో ఒక నిర్ణయం తీసుకుంటుందని ఆయన చెప్పారు. తాను అంతవరకు మాత్రమే చెప్పగలనని, తెలంగాణ ఇస్తారా ఇవ్వరా ఏం చేస్తారు అనే విషయం చెప్పలేనని ఆయన అన్నారు. గత ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం కాబట్టి తెలంగాణపై ప్రజలు ప్రశ్నిస్తారని, అందువల్ల ఏదో ఒకటి ప్రజలకు చెప్పక తప్పదని, అందువల్ల ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఆయన అన్నారు. రెండో ఎస్సార్సీ వేస్తామని ఎన్నికల ప్రణాళికలో చెప్పాం కదా, ఎందుకు వేయలేదని ప్రజలు అడుగుతారు కదా అని ఆయన అన్నారు. తెలంగాణపై పార్టీ అధిష్ఠానవర్గం నిర్ణయం ఏదైనా ఉండవచ్చునని, ఇలాగే వెళ్తామంటే మాత్రం కుదరదని ఆయన అన్నారు. తెలంగాణపై అధిష్ఠానవర్గం నిర్ణయాన్ని తమ పార్టీ రాష్ట్ర నాయకులంతా అంగీకరిస్తారనే నమ్మకం తనకు ఉందని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications