దాడిపై ప్రజారాజ్యం ఆందోళనలు

హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి సొంత నియోజకవర్గం పులివెందులలో తమ పార్టీ నేతలపై దాడికి నిరసనగా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు బుధవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేశారు. శాంతియుత పద్ధతుల్లో వారు తమ ఆందోళనలను కొనసాగించారు. సికింద్రాబాదులో వారు మానవహారం నిర్మించారు. గాంధీ విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు.

శ్రీకాకుళం, కడప జిల్లాల్లో కూడా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లాలో కూడా ప్రజారాజ్యం పార్టీ కార్యకర్తలు శాంతియుత ఆందోళనలకు దిగారు. రాష్ట్రవ్యాప్తంగా గాంధీ విగ్రహాల వద్ద వారు ప్రదర్శనలు చేశారు. పులివెందులలో దాడిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ప్రజారాజ్యం పార్టీ నాయకులు చెప్పారు. రాష్ట్ర పోలీసు డైరెక్టర్ జనరల్ కు వారు ఫిర్యాదు చేశారు. చిరంజీవికి లభిస్తున్న ప్రజాదరణను చూసి ఓర్వలేకనే కాంగ్రెస్ వారు దాడులకు పాల్పడుతున్నారని, దాడులు పిరికితనానికి నిదర్శనమని ప్రజారాజ్యం పార్టీ నాయకులన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+