అధికారం ప్రజారాజ్యానిదే: చిరంజీవి

Chiranjeevi
కడప: రాష్ట్రంలో తమ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి ధీమా వ్యక్తం చేశారు. ఆయన ప్రజా అంకిత యాత్ర గురువారం కడప జిల్లా చాపాడు నుంచి ప్రారంభమైంది. కొత్త నీరు రావాలని, ఆ కొత్త నీరు మనమేనని ఆయన అన్నారు. ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, ఆ మార్పు రావడం తథ్యమని, అది ప్రజారాజ్యంతోనే వస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో అవినీతిని అంతం చేద్దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ మార్పు కోసం తమకు సేవ చేయాలని ప్రజలు ఆదేశించారని, అందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఆయన అన్నారు.

అభివృద్ధిని ప్రజల ముందుకు తేవడానికి తాను కృషి చేస్తానని ఆయన చెప్పారు. ప్రజల ఆశీస్సులు తనకు ఉన్నాయని, తన వెనక ప్రజలున్నారని, వారి వెనక తానున్నానని ఆయన అన్నారు. మనల్ని మనమే పాలించుకుందామని, ఇందులో మనల్ని మనం మోసం చేసుకోవడం ఉండదని, మనల్ని మనం కబ్జా చేసుకోవడం ఉండదని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు ప్రజలకు ఏమీ చేయలేదని ఆయన విమర్శించారు. కడప జిల్లా మైదుకూరులో చిరంజీవి రోడ్డు షోకు ఏర్పాట్లు చేస్తున్న సమయంలో ముగ్గురికి విద్యుత్ షాక్ తగిలింది. వారిలో ఒక వ్యక్తి మరణించాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+