విద్యుత్ షాక్ తో చిరు ఫ్యాన్ మృతి
కడప: కడప జిల్లా మైదుకూరులో గురువారం చిరంజీవి పర్యటన సందర్భంగా విషాదం చోటుచేసుకుంది. చిరంజీవిని చూసేందుకు కొందరు అభిమానులు నాలుగు అంతస్థులున్న ఓ భవనంపైకి ఎక్కారు. అక్కడ వేచి ఉండగా మరింతమంది జనం చేరటంతో తొక్కిసలాట జరిగింది. దీంతో నలుగురు వ్యక్తులు విద్యుత్‌తీగలపై పడ్డారు. దీంతో షాక్ కొట్టింది. ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మిగిలిన వారిని ఆసుపత్రికి తరలించారు. అందులో ఇద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.












Click it and Unblock the Notifications