ఐపియస్ వ్యాస్ హత్య కేసు కొట్టివేత

హైదరాబాద్: ఐపియస్ అధికారి వ్యాస్ హత్య కేసును హైదరాబాదులోని నాంపల్లి కోర్టు గురువారం కొట్టేసింది. సాక్ష్యాలు సరిగా లేవని అంటూ కోర్టు కేసును కొట్టేసింది. ఈ కేసులో అరెస్టయిన ముగ్గురు నిందితులను కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. 1993లో హైదరాబాదులోని లాల్ బహదూర్ స్టేడియంలో వాకింగ్ చేస్తుండగా వ్యాస్ ను నక్సలైట్లు హత్య చేశారు. ఈ హత్య అప్పట్లో సంచలనం సృష్టించింది. ఈ హత్య జరిగినప్పుడు ప్రస్తుత ఆర్టీసి మేనేజింగ్ డైరెక్టర్ దినేష్ రెడ్డి కూడా లాల్ బహదూర్ స్టేడియంలో ఉన్నారు.

వ్యాస్ హత్య కేసులో మొత్తం 21 మంది నిందితులు ఉన్నారు. ఐదుగురు నిందితులు పరారీలో ఉన్నారు. ఈ కేసులో కోర్టు 67 మంది సాక్షులను విచారించింది. వీరిలో దినేష్ రెడ్డి కూడా ఉన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+