ఇద్దరు నక్సలైట్ల హతం
వరంగల్: వరంగల్ జిల్లా గోవిందరావుపేట మండలం తప్పంచ అడవుల్లో ఇద్దరు నక్సలైట్లు హతమయ్యారు. తమకు, నక్సలైట్లకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ప్రజా ప్రతిఘటన నక్సలైట్లు మరణించినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలం నుంచి రెండు రివాల్వర్ల ను, బైక్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇంతకు ముందు సమ్మిరెడ్డి అనే వ్యక్తిని నక్సలైట్లు కొట్టారు. ఈ సంఘటన నేపథ్యంలో పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు.
పోలీసుల కథనం ప్రకారం - ఈ తనిఖీలు సందర్భంగా నక్సలైట్లు పోలీసులకు తారసపడ్డారు. పోలీసులను గమనించి నక్సలైట్లు కాల్పులు జరిపారు. దీంతో పోలీసులు ప్రతికాల్పులు జరిపారు. ఈ ఎదురు కాల్పుల్లో ఇద్దరు నక్సలైట్లు మరణించారు. అయితే, ఇది బూటకపు ఎన్ కౌంటర్ అనే విమర్శలు వినిపిస్తున్నాయి. వారిద్దరిని పోలీసులు పట్టుకెళ్లి కాల్చి చంపారని, మరో ఇద్దరు పోలీసుల చేతిలో ఉన్నారని పౌర హక్కుల సంఘాల నాయకులు అంటున్నారు.












Click it and Unblock the Notifications