వీపీ సింగ్‌కు శాసనసభ నివాళులు
హైదరాబాద్: అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యాయి. సభ మొదలుకాగానే మాజీ ప్రధాని వీపీ సింగ్ మృతికి సభలో సంతాపం తెలిపారు. ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి మొదట సంతాపం వెలిబుచ్చారు. వీపీసింగ్ గొప్ప రాజకీయకోవిదుడని, నీతిమంతుడని వై.ఎస్ అన్నారు. నిస్వార్థ రాజకీయాలకు ఆయన చిరునామాగా నిలిచారని వర్తమాన రాజకీయాలకు కూడా ఆయన దిక్చూచీగా నిలిచారన్నారు. నిగర్వి, కళాభిమాని, కళాకారుడు అని ప్రశంసించారు. ఆయన కుటుంబానికి సంతాపం తెలిపారు.












Click it and Unblock the Notifications
