వైష్ణవి చైతన్యతో రిలేషన్ షిప్.. అసలు విషయం చెప్పేసిన ఆనంద్ దేవరకొండ

టాలీవుడ్ యంగ్ ఆర్టిస్ట్ లు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కాంబినేషన్ లో ఇదివరకే వచ్చిన బేబీ మూవీ పెద్ద విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2023 లో విడుదలైన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఈ చిత్రానికి సాయి రాజేష్ దర్శకత్వం వహించారు. SKN నిర్మాతగా వ్యవహరించారు. ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ రూ. 100 కోట్లకుపైగా గ్రాస్ రాబట్టి ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్యల కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. ఈ మూవీలో వైష్ణవి చైతన్య- ఆనంద్ దేవరకొండ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయింది. ఆ సమయంలోనే వీరి మధ్య లవ్ ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో పలు కథనాలు వచ్చాయి. ఇక మరోసారి వీరిద్దరి కాంబోలో ఎపిక్ అనే మూవీ రాబోతుంది. ఈ మూవీ సెప్టెంబర్ 11న విడుదలకు సిద్ధం అవుతోంది.

ఇప్పటికే రిలీజ్ అయిన ఎపిక్ మూవీ ట్రైలర్ యూత్ ను బాగా ఆకట్టుకుంది. ఈటీవీ విన్' లో 90's' వెబ్ సిరీస్ తో మంచి ఫాలోయింగ్ ను సంపాదించుకున్న ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందించారు. అలాగే ఈ మూవీని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌ టైన్‌ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల సెన్సార్ కార్యక్రమాలను ఈ మూవీ పూర్తి చేసుకుంది. సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ఏ సర్టిఫికెట్ జారీ చేశారు. ఈ మూవీలో వైష్ణవి చైతన్య- ఆనంద్ దేవరకొండ మధ్య కొన్ని రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

అయితే బేబీ సినిమాతో వైష్ణవి చైతన్య- ఆనంద్ దేవరకొండ మధ్య మంచి అనుబంధం ఏర్పడింది. ఇప్పుడు వీరిద్దరూ ఎపిక్ సినిమాలో కూడా కలిసి నటించారు. ఈ మూవీలో వీరిద్దరి మధ్య రొమాంటిక్ సీన్స్ కూడా ఉన్నాయి. ఎపిక్ మూవీతో ఆనంద్ దేవరకొండ- వైష్ణవి చైతన్య మరింత క్లోజ్ అయ్యారని చెప్పొచ్చు. ఈ క్రమంలో విజయ్- రష్మిక మాదిరిగానే వీరిద్దరూ కూడా ప్రేమించుకుని పెళ్లి చేసుకుంటారని టాక్ నడుస్తోంది. ఈ మేరకు సామాజిక మాధ్యమాల్లో మీమ్స్, రీల్స్ తెగ వైరల్ అయ్యాయి.

AnandDeverakonda in Relationship with Vaishnavi Chaitanya Anand Deverakonda reveals the truth

అయితే ఇదేం విషయంపై ఆనంద్ దేవరకొండ ఇటీవల క్లారిటీ ఇచ్చాడు. ' అదేం లేదండి.. మేమిద్దరం ఫ్రెండ్స్ అంతే.. నాకు ఇంట్లో పెళ్లి ప్రెజర్ ఉంది. కానీ నేను ఇప్పుడు చేసుకోను. వైష్ణవి ఇంకా చిన్న పిల్లే.. తనకు 24 ఉంటాయి అంతే. ఆమె కెరీర్ ఇప్పుడే మొదలు పెట్టింది. ఆమెకు ఇంకా పెద్ద కెరీర్ ఉంది. మేమిద్దరం కలిసి రెండు సినిమాలు చేయడం.. అన్నయ్య- రష్మిక అలా ప్రేమించుకుని పెళ్లి చేసుకోవడంతో మా మీద కూడా అలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. అంతే కానీ మా మధ్య అలాంటిది ఏమీ లేదు. అని ఆనంద్ దేవరకొండ తెలిపాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+