సిఎం నచ్చజెప్పడం వల్లనే..: ఎర్నేని
హైదరాబాద్: ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర రెడ్డి నచ్చజెప్పడంతో తాను రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నానని కైకలూరు కాంగ్రెస్ అనుబంధ శాసనసభ్యుడు ఎర్నేని రాజా రామచందర్ అన్నారు. అధికారులు సహకరించకపోవడం వల్లనే తాను రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు ఆయన సోమవారం మీడియా ప్రతినిధులతో చెప్పారు.
అధికారుల్లో అవినీతి పెరిగిపోయందని, దీన్ని ఎవరు తొలగించలేరని ఆయన అన్నారు. అవినీతి అధికారులు తమకు సహకరించడం లేదని ఆయన విమర్శించారు. ఏం జరుగుతుందో చూద్దామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
