కేరళ సిఎంపై సందీప్ తండ్రి గుర్రు

సందీప్ కుటుంబానికి సంతాపం తెలిపేందుకు కర్ణాటక ముఖ్యమంత్రి యెడ్యూరప్ప సైతం వారి ఇంటికి రాగా సొంత రాష్ట్రమైన కేరళనుంచి ఎవరూ రాకపోవటం, అంత్యక్రియలకు కేరళ తరపున ఒక్క మంత్రి కూడా వెళ్లకపోవటం కేరళలో విపక్షాల తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో ముఖ్యమంత్రి స్వయంగా సందీప్ ఇంటికి వచ్చారు. అయితే సందీప్ తండ్రి తాను ఎవరినీ కలవనని, రాజకీయనాయకులు ఎవరైనా లోపలకు వస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించారు. ముఖ్యమంత్రి పర్యటనకు ముందు తనిఖీకి పోలీసు కుక్కలను కూడా లోపలికి రానివ్వలేదు. దీంతో పోలీసులు కష్టపడి సందీప్ తల్లి ధనలక్ష్మిని మాట్లాడేందుకు ఒప్పించారు. అచ్యుతానందన్, బాలకృష్ణలు ఆమెతోనే మాట్లాడి వెనుదిరిగారు.












Click it and Unblock the Notifications
