రెండు కిలోల బంగారం, 3 కోట్ల ఆస్తులు
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ నగరపాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) టౌన్‌ప్లానింగ్ అధికారి భిక్షపతి నివాసంలో మంగళవారం అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయనే అరోపణతో ఈ దాడి జరిగింది. హైదరాబాదులోని మధురానగర్ లో ఉన్న ఆయన ఇంటిలో సోదాలు జరిగాయి. మధ్యాహ్న సమయానికి 20 కిలోల బంగారాన్ని, మూడు కోట్ల రూపాయల విలువైన ఆస్తుల పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.












Click it and Unblock the Notifications