అసెంబ్లీలో నేతల అరెస్టు ప్రకంపనలు
హైదరాబాద్: పెట్రో ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రాజభవన్ చలో కార్యక్రమం సందర్భంగా ప్రతిపక్షాల నేతల అరెస్టు ప్రకంపనలు మంగళవారం శాసనసభలో కూడా వినిపించాయి. తమ నేతల అరెస్టును నిరసిస్తూ ప్రతిపక్షాల శాసనసభ్యులు ఆందోళనకు దిగారు. హోం మంత్రి కె. జానారెడ్డిని సభకు రప్పించి తమ నేతల అరెస్టుపై ప్రకటన చేయించాలని వారు డిమాండ్ చేశారు. సభాధ్యక్ష స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ అందుకు నిరాకరించారు.
దాంతో తెలుగుదేశం, సిపిఐ, సిపిఎం, తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) సభ్యులు స్పీకర్ స్పోడియాన్ని చుట్టుముట్టారు. దీనివల్ల సభా కార్యక్రమాలు స్తంభించాయి. డిప్యూటీ స్పీకర్ ఎంతగా నచ్చజెప్పినా ప్రతిపక్షాల సభ్యులు వినిపించుకోలేదు. దీంతో ఆమె సభను రేపటికి వాయిదా వేశారు.












Click it and Unblock the Notifications