శంకరరావుకు చేదు అనుభవం
హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ శాసనసభ్యుడు పి. శంకర్ రావుకు వరుసగా రెండో రోజు మంగళవారం శాసనసభలో చేదు అనుభవం ఎదురైంది. ధ్రువీకరణ పత్రం చూపాలంటూ పోలీసులు మంగళవారం శంకరరావును అడ్డుకున్నారు. సోమవారం కూడా ఆయనకు ఇదే పరిస్థితి ఎదురైంది. దీంతో శంకరరావు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ శాసనసభ్యుడనైన తనను గుర్తు పట్టడం లేదా ఆయన అన్నారు. ఈ విషయమై స్పీకర్ కె. సురేష్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానని ఆయన హెచ్చరించారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శాసనసభలో బిల్లు ప్రతిపాదించాలనే నినాదం రాసి ఉన్న టీ షర్టులను ధరించి తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) శాసనసభ్యులు మంగళవారం శాసనసభకు హాజరయ్యారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధానమైన ప్రశ్నలు చర్చకు వస్తున్నందున వాయిదా తీర్మానాలు ప్రతిపాదించకూడదని తెలుగుదేశం, తెరాస, సిపిఎంలు నిర్ణయించుకున్నాయి. దీంతో సాఫీగా ప్రశ్నోత్తరాల సమయం సాగింది.












Click it and Unblock the Notifications