న్యూఢిల్లీ: నేటినుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభం అవుతున్నాయి. 10 రోజులపాటు ఇవి కొనసాగుతాయి. ఈసారి ముంబయి పేలుళ్ల ప్రభావం సమావేశాలపై బాగా ఉండనుంది. పెరిగిన ధరలు, ఆర్థికమాంద్యం, పెట్రోధరల తగ్గింపు తదితర అంశాలు ప్రస్తావనకు రానున్నాయి. ఈరోజు మాత్రం మాజీప్రధాని వీపీ సింగ్‌కు సంతాపం ప్రకటిస్తారు. అనంతరం సభ వాయిదాపడనుంది.