రోడ్డు ప్రమాదంలో 5 గురు మృతి
మహబూబ్‌నగర్: మహబూబ్‌నగర్ జిల్లాలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కొత్తకోట మండలం నాటెల్లి వద్ద ఆర్టీసీ బస్సు - జీపు ఢీ కొంనడంతో ఈ దుర్ఘటన సంభవించింది.
సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. పుష్కర స్నానాలకు వెళుతుండగా ప్రమాదం జరిగింది. మృదతులంతా హైదరాబాద్, చింతల్ ప్రాంత వాసులుగా గుర్తించారు. మంత్రి చిన్నారెడ్డి కూడా సంఘటన స్థలాన్ని సందర్శించారు.












Click it and Unblock the Notifications