కృష్ణాజిల్లా: రోడ్డు ప్రమాదాల్లో 8 మంది మృతి
విజయవాడ: కృష్ణా జిల్లాలో బుధవారం జరిగిన రెండు రోడ్డుప్రమాదాల్లో 8మంది మృతి చెందారు. నందిగామ వద్ద 9వ నెంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో 5గురు మృతి చెందారు. హైదరాబాద్ కేపీహెచ్‌బీ కాలనీకి చెందిన డాక్టర్ దుర్గాప్రసాద్ ఐజెంట్ సొల్యూషన్స్‌లో టెక్నికల్ డైరక్టర్‌గా పనిచేస్తున్నారు. విజయవాడలో తమ సమీప బంధువు చనిపోవటంతో పరామర్శకు కుటుంబంతో సహా ఆయన వెళ్లారు. తిరిగి వస్తుండగా కారును ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో దుర్గాప్రసాద్‌తోపాటు ఆయన కుమారుడు సాయి, ఏడాది వయసు గల మనుమరాలు అమృత, తండ్రి సత్యనారాయణమూర్తి, డ్రైవర్ రాజులు మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన కూతురు, కోడలును విజయవాడ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు నూజివీడు మండలం బత్తువారిగూడెం వద్ద ఆటోను లారీ ఢీకొట్టటంతో ముగ్గురు చనిపోయారు.












Click it and Unblock the Notifications
