న్యూఢిల్లీ: ముఖ్యమంత్రి వై.ఎస్ రాజశేఖరరెడ్డి ఈరోజు ఢిల్లీలో ఎస్సీ, ఎస్టీ జాతీయ కమిషన్ ఛైర్మన్ బూటాసింగ్‌ను కలిశారు. ఎస్సీల వర్గీకరణపై చర్చించారు. రాష్ట్రంలో దీనిపై జరుగుతున్న ఆందోళనలు గురించి వివరించి త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరారు. అనంతరం ఆయన పొన్నాలతో కలిసి జలవనరుల శాఖ మంత్రి సైఫుద్దీన్‌ను కలిశారు. ఆ తరువాత పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీని కలిశారు. ఈరోజు సాయంత్రం వ్యవసాయశాఖ మంత్రి శరద్‌పవార్‌ను కలుస్తారు. మంత్రి రఘువీరారెడ్డితో కలిసి గిట్టుబాటుధరలు, రునమాఫీ వంటి పలు విషయాలపై చర్చిస్తారు.