ఇల్లు లేనివారు ఉండొద్దు: సిఎం

విశాఖపట్నంలో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని శుక్రవారం ఉదయం ప్రారంభించిన అనంతరం ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల మహిళా సదస్సులో పాల్గొని మాట్లాడారు. గ్రేటర్ విశాఖలో ఇప్పటికే 33 వేల ఇళ్లను నిర్మించామని ఇంకో 33వేల ఇళ్లు కట్టటానికి కూడా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. మరిన్ని అణగారిన కులాలవారిని వెనుకబడిన కులాల జాబితాలో చేరుస్తామని అన్నారు. దీనివల్ల ఇంజనీరింగ్ కాలేజీల్లో కట్టాల్సిన 36వేల రూపాయల ఫీజులు కట్టాల్సిన అవసరం ఉండదని ఆయన అన్నారు. పిల్లలు మంచి చదువుల చదివి మంచి ఉద్యోగాలు పొందగలుగుతారని అన్నారు. వచ్చే ఏడాది ఆగ్రకులాల్లో ఆర్థికంగా వెనుకబడినవారికి కూడా ఈ సౌకర్యం వర్తింపజేస్తామని అన్నారు.












Click it and Unblock the Notifications